Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌లోనే గర్భాశయ క్యాన్సర్‌ మరణాలెక్కువ

భారతదేశంలో మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ మరణాలు ఎక్కువగా ఉన్నాయని, ఏటా సుమారు 73 వేలమంది మహిళలు మరణిస్తున్నారని అమెరికాలో జరిపిన ఒక పరిశోధనలో వెలువడిన రిపోర్ట్‌ పేర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా సర్వికల్‌ క్యాన్సర్‌ వల్ల సంభవించే మరణాల్లో 24.4 శాతం మరణాలు మనదేశంలోనే సంభవిస్తున్నాయని ఈ రిపోర్ట్‌ తెలిపింది. ఈ మరణాలు చైనా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌ దేశాల్లో కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా సర్వికల్‌ క్యాన్సర్‌ వల్ల సుమారు 2,75,000 మంది మహిళలు మరణిస్తుండగా, సుమారు 5 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్టు ఈ రిపోర్ట్‌ చెబుతోంది. ఈ క్యాన్సర్‌ ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాల్లోను, ఇంకా అభివృద్ధి చెందని ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాల్లోను ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్‌ వల్ల సంభవించే మరణాల్లో భారత్‌, చైనా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, నైజీరియాల్లో సగభాగం ఉన్నాయని, అయితే ఆష్ట్రేలియాలో ఈ మరణాలు తక్కువేనని సర్వికల్‌ క్యాన్సర్‌ గ్లోబల్‌ క్రైసిస్‌ కార్డ్‌ రిపోర్ట్‌ చెబుతోంది.

More Telugu News